చెరువులో ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తికి స్వల్పగాయాలు

ప్రజాశక్తి-పెద్దముడియం (కడప) : గ్రామ పంచాయితీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టర్‌ చెరువులో బోల్తాపడిన ఘటన భుధవారం పెద్దపసుపులలో చోటు చేసుకుంది. ఉదయాన్నే గ్రామంలో చెత్తను సేకరించి ఊరి శివార్లలో ఉన్న డంపు యార్డు లో చెత్తను వదిలి తిరిగి వస్తుండగా అదుపు తప్పిన ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకెళ్లడం తో డ్రైవర్‌ దావీదు వెంటనే క్రిందికి దూకడం తో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గ్రామ పంచాయితీ సిబ్బంది క్రేన్‌ సాయంతో ట్రాక్టర్‌ ని బయటకి తీశారు. అయితే చెరువు కట్ట పై వున్న రోడ్డు వర్షపు నీటి కోతకు గురికావడంతో ప్రక్కల వున్న మట్టి మొత్తం కొట్టుకుపోయి రోడ్డు ఇరుకుగా మారింది. అంతేకాక పూర్తిగా నీటితో నిండిన చెరువు కట్ట పై ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికి తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రాణ, ఆస్తి నష్టాలు జరగా కుండా చర్యలు తీసుకొని రక్షణగా గోడలు నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

➡️