ట్రాక్టర్‌ బోల్తా డ్రైవర్‌ దుర్మరణం

ప్రజాశక్తి-చిన్నమండెం (రాయచోటి-అన్నమయ్య) : చిన్నమండెం మండల పరిధిలోని మల్లూరు కు చెందిన ఉస్మాన్‌ భాష కుమారుడు, రఫీ ట్రాక్టర్‌ తో జీవనం సాగిస్తుండేవాడు. దేవగుడి పల్లె గ్రామ పరిధి లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక ఉన్నటువంటి వంకలో ఇసుక కోసం పోయి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఆదివారం దుర్మరణం పాలయ్యాడు. సుమారు 30 సంవత్సరాలు లోబడి వయస్సు ఉండే ఇతనికి ఇద్దరు కుమారులున్నట్లు తెలిపారు. రఫీ మృతి పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని శివపరీక్షల నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

➡️