ప్రజాశక్తి-పెద్దవడుగూరు(నంద్యాల) : జిల్లాలోని పెద్దవడుగూరు మండలంలోని లచ్చింపల్లి వద్ద నాపరాళ్లను తరలించే ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లికి చెందిన పెద్ద సూర్యనారాయణ రెడ్డిగా గుర్తించారు.
