సంప్రదాయాలను గౌరవించాలి : సంక్రాంతి వేడుకల్లో సిఐ కృష్ణ భగవాన్

Jan 7,2025 17:25 #Kakinada, #SI

ప్రజాశక్తి – సామర్లకోట : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతివారు గౌరవించి ప్రాధాన్యత నివ్వాలని సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ కృష్ణ భగవాన్ పిలుపు నిచ్చారు. సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ లో మంగళవారం హెడ్మాస్టర్ తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్దులకు రంగ వల్లుల పోటీలను సిఐ కృష్ణ భగవాన్, మున్సిపల్ కమిషనర్. ఏ శ్రీ విద్య, వార్డు కౌన్సిలర్ బలుసు వాసులు ప్రారంభించారు. చక్కటి సృజనాత్మకతతో విద్యార్దుల రంగోలిలతో ఆకట్టుకున్నారు. అనంతరం భోగి మంటను సర్కిల్ ఇన్స్పెక్టర్ భగవాన్ వెలిగించి ప్రారంభించారు. పోలీస్ శాఖ తరపున పట్టణం లో ఎస్పి విక్రాంత్ పాటిల్, డిఎస్పి శ్రీహరి రాజు ఆదేశాలతో వార్డ్ కౌన్సిలర్ బలుసు వాసు చొరవతో సంక్రాంతి సంబరాలను ఈ పాఠశాలలో నిర్వహించినట్లు హెచ్ ఎం సాయి రామకృష్ణ తెలిపారు. విద్యార్దులు సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సిఐ సూచించారు. అనంతరం రంగవల్లుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పండగ వాతావరణంలో సంక్రాంతి సంబరాల నిర్వహణ పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సంబరాల నిర్వహణకు తమ పాఠశాలకు అవకాశం ఇవ్వడం పట్ల హెచ్ ఏం సాయి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తెదేపా క్రీడా విభాగ కన్వీనర్ నిమ్మకాయల కిరణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️