పెదబయలు (అల్లూరి) : మండల కేంద్రంలో జరుగు వారపు సంతా ఆటోలు జీపు లతో కిక్కిరిసిపోవడం తో బయటకు వెళ్ళడానికి మార్గం లేకుండాపోయింది. గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అయింది. ఇవి గమనించిన ప్రజాశక్తి స్థానిక ఎస్‌ఐ, కొల్లి రమణ కు ఫోన్‌లో మాట్లాడి విషయం తెలిపింది. ఎస్ ఐ కొల్లి రమణ, సిబ్బంది కలిసి అతి కష్టం మీద మూడు పాయింట్లలో రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. జి, సీ, సీ, గోదాము మొదలుకొని డాక్టర్ అంబేద్కర్ కూడలి జంక్షన్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సమీపంలో ఆటోలు రద్దీ అధికమయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కువయ్యింది. పండగ సంత కావడంతో మారుమూల గిరిజన రైతులు వాణిజ్య దినుసులు అమ్మి నూతన వస్త్రాములు కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులు నానా కష్టాలు పడ్డారు. సంక్రాంతి క్యాలండర్ ప్రకారంగా ఈ సారి పండగ జరుగుతుండటంతో వారపు సంత కిక్కిరిసిపోయింది. దీంతో మారుమూల ప్రాంతాల నుండి ద్విచక్ర వాహనాలు ఆటోలు అధికంగా వచ్చాయి.
