ప్రజాశక్తి-శింగరాయ: కొండపి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవ లప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం శింగరాయకొండ మండలంలోని అంగన్‌వాడీ సిబ్బందికి అయోడిన్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడిఎస్ సీడీపీవో మల్లీశ్వరి, సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ హాజర య్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతు సంస్థ నుం చి ప్రకాశం జిల్లాలో సుమారుగా 40 గ్రామాలలో ఉన్న వయోజన బాలలు, గర్భిణీ, బాలింతలు మరియు ఇతర స్త్రీలుకి అయోడిన్ మరియు ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు మీద అవగాహన కార్యక్రమాలు తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే వీధి నాటకాలు, సాంస్కతిక కార్యక్రమాలు ద్వారా 40 గ్రామాలలో అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు ట్రైనర్‌గా రిమ్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ అయోడిన్ లోపం వల్ల కలిగే రుగ్మతలు, అయోడిన్ లోప నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లు, ఆశా కార్యకర్తలు, సంస్థ సిబ్బంది బాపట్ల దివ్య, రంగలక్ష్మి, అరుణ జ్యోతి, రేవతి తదితరులు పాల్గొన్నారు.
