ధాన్యం కొనుగోలుపై శిక్షణ

Oct 5,2024 15:34 #grain procurement, #Training

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ధాన్యం కొనుగోలు పక్రియ పై శనివారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న జిల్లా వ్వవసాయాధికారి జడ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్‌ సిజన్‌ 24 25 కు గాను కామన్‌ ధాన్యం క్వింటాలు 2300 , గ్రేడ్‌ ఏ ధాన్యాం క్వింటాలు 2320 , కనీస మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు ఏరైతు కూడ కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకి అమ్ముకోవలసిన అవసరం లేదని అన్నారు గత ప్రభుత్వం లో రైతులు ఎదుర్కున్నా సమస్యలు ద్రుష్టి లో ఉంచుకొని వారికి నచ్చిన రైసుమిల్లుకి తోలుకొనే అవకాశం కల్పంచినట్లు తెలిపారు ధాన్యం అమ్మిన రైతులు ప్రభుత్వం 48 గంటలలో సోమ్మలు చెల్లిస్తుందని అన్నారు ధాన్యం అమ్మకంలో ఎటువంటి మోసాలు లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈకార్యక్రమంలో తాహాశీల్దార్‌ వై అప్పారావు, ఏవో వై ప్రసాద్‌, ఎంఎల్‌ వో దాస్‌ , రైసుమిల్లర్లు, వి ఏ ఏ లు , విఆర్వో లు, ధాన్యం కోనుగోలు సిబ్బంది పాల్గొన్నారు.

➡️