ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

Jun 10,2024 21:29

ప్రజాశక్తి – సీతంపేట : వెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దిగువ కాలువరాయిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ నిర్వహించారు. రిసోర్స్‌పర్సన్‌ ఎ.చిరంజీవిరావు, పి.నాగేశ్వరరావు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత వివరిస్తూ నారుమడి తయారీ విధానం, వేసవి దుక్కులు గురించి వివరించారు. అలాగే భూమిలో పోషకాలు నత్రజని పెంపొందించడానికి పచ్చిరొట్ట విత్తనాలు, నవధాన్యాల ఉపయోగాలను తెలిపారు. బీజామృతంతో విత్తన శుద్ధి, నారుశుద్ధి వరి దిగుబడి కోసం లైన్‌ షోయింగ్‌ శ్రీవరి, జమున మోడల్‌ కోసం వివరించారు. చిరుధాన్యాలైన కొర్రలు, రాగులు, చామలు, గంటెలు, జొన్నల ఉపయోగాలు, అలాగే దీనికి చిరుధాన్యాలు విస్తీర్ణం పెంపొందించాలని రైతులకు వివరించారు. రసాయినిక ఎరువులు బదులుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఉపయోగిం చాలన్నారు. పురుగు మందులు బదులుగా కషాయాలు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నిస్త్రం, పంచపత్రిక కసాయం తయారు చేసి వాటిని ఉపయోగించాలని తెలిపారు. చీడపురుగులు తెగులు నివారణకు పక్షిస్తావరాలు, అలాగే రక్షక పంట్ల కంది, ఆముదం, బంతి గట్టు చుట్టూ వేయాలని రైతులకు తెలిపారు. గ్రామస్తులు, ప్రకతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చినందున వెలుగు అసోసియేషన్‌ నుంచి సోలార్‌ ఎనర్జీ కార్డు రూ.3లక్షల విలువ గల వస్తువులను ఇచ్చారు. దీన్ని డెమో చేసి చూపించారు. ఈ శిక్షణలో పిఎండిఎస్‌ గులిరాగి జమున పద్ధతి వేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈ శిక్షణలో దిగువ కలవరాయి, కారిగూడ, నడిమిగూడ నుండి రైతులు పాల్గొన్నారు. వెలుగు అసోసియేషన్‌ కార్యకర్త బి.జగ్గయ్య, మొబలైజర్‌ బె.రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️