ప్రజాశక్తి -భీమునిపట్నం : ట్రాన్స్ జెండర్లపై చిన్న చూపు తగదని స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సహకారంతో ఎన్‌ఎస్‌ఎస్ మూడు విభాగాల ఆధ్వర్యాన మంగళవారం కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య, ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాన అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. సమాజంలో వీరిని వేరుగా చూడరాదన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ మూడు విభాగాల ప్రోగ్రాం అధికారులు డాక్టర్ డి.ప్రవీణ, డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, ఎస్.శ్రీను, అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.సహదేవుడు, ఉమెన్ ఎంపవర్‌మెంట్ కో-ఆర్డినేటర్ డి.మాధురి, వై.శ్రీనివాస్, పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
