ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఇసుక లభ్యత ఉంది, నూతన ఇసుక విధానం ఏమిటి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏమేం చర్యలు తీసుకున్నారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఏడు ఇసుక డిపోలు ఉన్నాయని కానీ అందులో జీరో శాతం ఇసుక ఉందని మైనింగ్ శాఖ ఏడీ వివరించారు. ప్రస్తుతం జూలై నుంచి సెప్టెంబర్ వరకు మాన్ సూన్ కాలంలో రివర్లలో మైనింగ్ చేయరాదని ప్రభుత్వం సూచించిందన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ నూతన ఇసుక విధానం అమలుపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం నిర్వహణ ఛార్జీలు వసూలుతో వినియోగదారులకు డిపోల ద్వారా ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఉత్త ర్వులు జారీ చేసిందిన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను జిల్లాలో పటిష్టంగా అమలు పరచాలిన్నారు. ప్రభుత్వం టన్ను ఇసుక ధరను ఒక్కో రీచ్ పరిధిలో స్టాక్ పాయిం ట్‌కు ఒక్కొక్క ధరను నిర్ణయించిందని నిర్ణయించిన టన్ను ధరకు రవాణాచార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని నదులు, కెనాల్స్, బ్యారేజీలు, డ్యామ్‌ల పరిధిలో డీసిల్టేషన్ పాయింట్లను వెంటనే గుర్తించి ఇసుక లభ్యతపై ఫీజబిలిటీ రిపోర్టును రెండు రోజుల్లోగా సమర్పించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశిం చారు. ఫీజిబిలిటీలో ఎన్విరాన్మెంటల్ నిబంధనలను పరిగణలోకి తీసుకోవా లన్నారు. డిసిల్టేషన్ పాయింట్లు గుర్తించి ఇసుక లభ్యత అందుబాటులోకి వచ్చిన పిదప ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి వాటికి అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన గహాల నిర్మాణానికి ఎంత మేర ఇసుక అవసరం అవుతుందని హౌసింగ్ పీడీని కలెక్టర్ ప్రశ్నించగా అంచనాగా 43 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం అవుతుందని హౌసింగ్ పీడి పేర్కొన్నారు. ఇసుక లభ్యతపై ఫీజిబిలిటీ నివేదిక అందిన తర్వాత మళ్లీ ఒకసారి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశమై స్టాక్ పాయింట్లు ఏర్పాటు, ఎక్కడెక్కడ ఇసుక డంప్ చేయాలి, వాటి ధర తదితరాలను నిర?యించి వాటి వివరాలతో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో అక్కడక్కడ అక్రమంగా ఇసుక డంపులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీస్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. అక్రమ ఇసుక డంపులు గుర్తించగానే గనుల శాఖ వెంటనే నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నోటీస్ పీరియడ్ ముగిసిన పిదప మార్గదర్శకాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్, మైనింగ్ శాఖ ఏడీ రవికుమార్, హౌసింగ్ పీడీ శివయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రసన్నకుమార్, డిపిఓ ధనలక్ష్మి, ఎస్‌ఇబి, రవాణా, ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
