అవకాశ వాదులను చెత్తబుట్టలో వేయండి

Apr 3,2024 21:37

పార్టీ గెలుపునకు కృషి చేయండి

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు

మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌ సహా పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-విజయనగరంకోట  : టిక్కెట్‌ వస్తే ఒకలా..రాకపోతే మరోలా వ్యవహరిస్తున్న అవకాశవాదులను చెత్తబుట్టలో వేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. గజపతినగరం నియోజకవర్గానికి చెందిన జెడ్‌పిటిసి మాజీసభ్యులు మక్కువ శ్రీధర్‌, కొణిశ గ్రామ సర్పంచ్‌ శీరంరెడ్డి రామ్‌కుమార్‌, శారదానాయుడు, సర్పంచ్‌లు అనూష, సూరెడ్డి రామలక్ష్మి,, సహా పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, వందల మంది కార్యకర్తలు బుధవారం పార్టీ కార్యాలయం అశోక్‌బంగ్లాలో అశోక్‌గజపతిరాజు, గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌, విజయనగరం ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా పివి గోపాలరాజు అధ్యక్షతన జరిగిన సభలో అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందన్నారు. ఐదేళ్ల పాలనలో ఉత్తరాధ్ర జిల్లాల సుజల స్రవంతి ఏమైందని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన విద్యాశాఖా మంత్రి రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమయ్యే ందుకు కారకులయ్యారని విమర్శించారు. ఐటి సెక్టార్‌ పక్క రాష్ట్రాలకు తరలి పోతోందని, ఈ ఐదేళ్లలో ఒక్క కంపెనీ కూడా రాలేదని అన్నారు. రాష్ట్రంలో దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

అవకాశ వాదులను చెత్తబుట్టలో వేయండి

ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాల్లోనూ టిడిపి గెలుస్తుం దన్నారు. పార్టీ ఎంతో నమ్మకంతో తనకు ఎంపి టిక్కెట్‌ ఇచ్చిందని, అందరూ సహకరించి గెలిపించాలని కోరారు. గజపతినగరం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్దఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు చేరడంతో పార్టీ బలం మరింత పెరిగిందన్నారు. కంచుకోటైన జిల్లాలో మళ్లీ టిడిపి జెండా ఎగురవేయాలని కోరారు. మక్కువ శ్రీధర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ సభ్యులను బలిపెట్టి ప్రత్యర్థులు గెలవాలను కుంటున్నారని అన్నారు. గత 20ఏళ్లగా మండల ప్రజలు తనను నమ్ముకుంటూ వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కోసం పనిచేస్తానని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ టిడిపికి కంచుకోట అయిన విజయనగరం జిల్లాలో అన్ని సీట్లను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష ్‌బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, మండల అద్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, గంట్యాడ మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు, నాయకులు చప్పా చంద్రశేఖర్‌, రుంకాన అరుణ, గుంట్రోతు గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️