మారు జాతరకు పోటెత్తిన యాత్రికులు

Feb 4,2025 21:26

ప్రజాశక్తి – మక్కువ : రాష్ట్ర గిరిజన జాతరగా మార్పు చెందిన పోలమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం వనం, చదురు గుడుల వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం రథసప్తమి కావడంతో మహిళా భక్తులు అధిక శాతం మధ్యాహ్నం 12గంటలు దాటాక అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయాలు కిటకిటలాడాయి. ఎప్పటి మాదిరిగానే దేవాదాయ శాఖ ఇఒ వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. సాలూరు సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తొలుత వనం గుడి వద్ద దర్శించుకున్న భక్తులు గ్రామంలోని చదురు గుడి వద్దకు వచ్చి దర్శించుకున్నారు. వనం గుడి వెనుక భాగంలో ఉన్న వేపచెట్టుకు భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

➡️