పులివెందుల డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) పరిధిలో చేసిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం అలజడి రేపుతోంది. ఏడాది వ్యవధిలో ఆడిట్, విజిలెన్స్ విచారణల పేరుతో వరు సగా శూలశోధన చేయడం వెనుక మర్మమేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఐదేళ్లలో చేపట్టిన 6,300 అభివృద్ధి పనులపై ఆర్నెళ్ల కిందట నుంచి పాడాలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి వ్యయాలపై ఆడిట్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయో తెలియలేదు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనులకు రూ.38 కోట్లు విడుదల చేసింది. స్థానిక అధికార టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోవడం, వరుసగా ఫిర్యాదులు చేసిన అనంతరం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పులివెందుల నియోజకవర్గ పరిధిలో గత వైసిపి సర్కారు హయాంలో చేపట్టిన సుమారు 6,300 అభివృద్ధి పనులపై ఆడిట్‌లో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకున్నాయో తెలియ లేదు. ఇంతలో మరో సారి విజిలెన్స్ విచారణ ఆదేశించడం వెనుక మత లబేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. ఆయా ప్రభుత్వ విభాగాల వారీగా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. పిఆర్, ఆర్ అండ్‌బి, ఎపి ట్రాన్స్‌కో, స్పోర్ట్స్, మున్సిపాలిటీ తదితర విభాగాల్లో పెద్ద సంఖ ్యలో అభివృద్ధి పనులు చేపట్టింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ పనులపై విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం వెనక్కి తగ్గ డం తెలిసిందే. అభివృద్ధి పనుల్లో వాస్తవంగా అవకతవకలు జరిగి ఉంటే విచారించడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం సబబే. కానీ ఉద్దేశ పూర్వకంగా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో విచా రణల పేరుతో కాలయాపన చేయడం ఆందోళనకరమని గ్రహించాలి. గత వైసిపి సర్కారు హయాంలో వేల సంఖ్యలోని నీరు-చెట్టు పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. చిన్నపాటి తప్పిదాల పేరుతో కొంతమంది ఇంజి నీరింగ్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే పాడా, జల్‌జీవన్ తదితర అభివృద్ధి పనులపై ఆడిట్, విజిలెన్స్ వంటి ఏజెన్సీలను ఉసిగొల్పడం ఆందోళన కలిగిస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో పాడా ఏజెన్సీ కింద చేపట్టిన వేల సంఖ్యలోని అభివృద్ధి పనులపై విచారణకు ఆదే శించిన నేపథ్యం ప్రభుత్వ వైఖరి సందేహాలకు తావిస్తోంది. గత నీరు-చెట్టు అభివృద్ధి పనుల్లో చోటుచేసుకున్న చిన్నపాటి కంపతొలగింపు వంటి తప్పి దాలపై ఇంజినీరింగ్ అధికారులపై కేసులు నమోదు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. బ్యూరోక్రసీ సైతం నిజాయతీగా విధులు నిర్వహి ంచాల్సిన అవసరం ఉరుముతోంది. లేనిపక్షంలో పాలక వర్గాలకు సహకరిస్తే బ్యూరోక్రసీ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే సంగతిని గమనంలో ఉంచుకుని ప్రవర్తించాల్సి ఉంది. లేనిపక్షంలో ఇటువంటి ప్రతీకారాత్మక ధోరణి తరహాలో విచారణ చేయకుండా అర్థవంతమైన అక్రమాలపై దృష్టి సారిస్తేనే ఎంతో ప్రయోజనం ఉంటుందనే సంగతిని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. – ప్రజాశక్తి – కడప ప్రతినిధి
