ప్రజాశక్తి-మార్కాపురం : కాలుష్య నివారణలో భాగంగా పచ్చదనం పెం చుకోవాలని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చెట్ల ను కాపాడుకోవాలని పెద్దారవీడు ఎస్‌ఐ అనిల్ కుమార్ విద్యార్థులకు సూ చించారు. బుధవారం మార్కాపురం సమీపం లోని దేవరాజుగట్టు వద్ద గల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా ఆ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్నా క్రిష్ణ చైతన్య మాట్లాడారు. మొక్కల యొక్క ఆవశ్యకతను, మొక్కలను పెంచడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు. ఆ కళాశాల దగ్గరలోని పెద్దారవీడు పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెన్నా కష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రంగనాయకులు, కళాశాల ఏవో బి.ప్రభాకర్, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పివి అనిల్ కుమార్, వివిధ విభాగపు అధిపతులు పి రామ్మోహన్, డాక్టర్ జెవి అనిల్ కుమార్, కె.రాముడు, కె.కిషోర్‌బాబు, ప్రసన్న మురళి, జె.రమణారెడ్డి, ఏ.అమతవల్లి, పి మనోహర్, ఫిజికల్ డైరెక్టర్లు ఎన్ రంగస్వామి, ఎన్‌విఎస్‌ఎన్ అంజనీ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.