పోటో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన శ్రీనివాసాచారి
ప్రజాశక్తి – ఆదోని : కాళ్లు , చేతులు లోపం ఉన్న వారికి మోటర్ ట్రై సైకిల్లు ఇప్పించాలని ఆదోని టిడిపి 19వ వార్డు ఇంఛార్జి శ్రీనివాస్ ఆచారి కోరారు. సోమవారం ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ట్రై సైకిళ్లు కొంతమందికి ఇచ్చారు. అయితే రోడ్డుపై ఎత్తు ప్రాంతానికి వెళ్లే సమయంలో వాటిని నడపలేక వికలాంగులు ఇబ్బందులు పడ్డారు. వికలాంగుల కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారందరికీ మోటర్ తో ఏర్పాటు చేసిన ట్రై సైకిల్ పంపిణీ చేస్తే వారి రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని సబ్ కలెక్టర్ ని కోరాము.’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల విన్నపాన్ని సంబంధిత కార్పొరేషన్ కు సిఫార్సు చేస్తామని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు.