ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలంటూ గిరిజనుల నిరసన

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : మండలంలోని జడ్డంగి పంచాయితీలో చేసిన ఉపాధి పనికి ఉపాధి కూలీని చెల్లించాలంటూ … మండలంలోని జడ్డంగి చైతన్య నగర్‌ గ్రామస్తులు శుక్రవారం జడ్డంగి చైతన్య నగర్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసి మండల నాయకులు తెడ్ల రాంబాబు మాట్లాడుతూ … ఉపాధి కూలి సొమ్ము రాకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. సుమారు 40మంది ఉపాధి పని చేసి నేటికీ 6 వారాలకు పైన గడిచిందని, ఇప్పటివరకు కూలీలకు సుమారు రూ.3.6 లక్షలు రావాల్సి ఉందన్నారు. సంబంధిత అధికారులు నేటికి కూడా సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని తెడ్ల రాంబాబు ఆవేశం వ్యక్తం చేశారు. ప్రతి సారి అధికారులను కలిశామని, ప్రభుత్వా కార్యాలయాలు చుట్టూ తిరగటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధి కూలీల సొమ్ములను జమ చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్య్రమంలో ఆదివాసీ నాయకులు తెడ్ల రాంబాబు, జడ్డంగి గిరిజన మహిళా అధ్యక్షురాలు గూడెం లక్ష్మి, డబ్బకోట దుర్గ దేవి, తెడ్ల పార్వతి, పొడుగు లక్ష్మీ , తెడ్ల కరుణ కుమారి, చీడి చిన్నలు, పూసం లక్ష్మి, డాకమురి సత్యవతి, పొడుగు మల్లి బాబు, పాతర సత్యనారాయణ, మొసరి మల్లీశ్వరి, పల్ల వీరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️