ప్రజాశక్తి – పరవాడ: మండలంలోని లంకెలపాలెం బిసి బాలురు హాస్టల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారని, భగత్ సింగ్ పేరు వింటే చైతన్యం, భగత్ సింగ్ కదిలించే, నడిపించే ఓ స్ఫూర్తి అని కొనియాడారు. చిరుప్రాయంలోనే దేశం కోసం ఉరికొయ్యను ముద్దాడిన విప్లవదీరుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రజలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరికీ విద్య, ఉపాధి, వైద్యం వంటి మౌలిక వసతుల కోసం ప్రభుత్వాలపై భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డి ఉదరు, వై గోవిందరావు, ప్రసాద్, సంతోష్, సూర్య, రమణ, తేజ పాల్గొన్నారు.
మునగపాక: మండలంలోని వెంకటాపురం గ్రామంలో భగత్‌సింగ్ 117వ జయంతి సందర్భంగా శనివారం రాత్రి సిఐటియు నాయకులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, చిన్ని కిషోర్, దళాయి రాంబాబు, ఎస్ కష్ణ, ఎస్ నాయుడు, సిహెచ్ అప్పారావు పాల్గొన్నారు.