భగత్‌సింగ్‌కు నివాళి

ప్రజాశక్తి-చీమకుర్తి: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం పంగులూరి కృష్ణయ్య భవనంలో భగత్‌సింగ్‌ జయంతి నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాజు మాట్లాడుతూ యువత దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్‌సింగ్‌ చరిత్రను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేసిన ఒకటిన్నర ఏడాది కాలంలో 400పైగా రక్తదానాలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు డి.వాసుబాబు, మండల నాయకులు ప్రవీణ్‌, పుష్పరాజ్‌, తేజ, అభిరామ్‌ పాల్గొన్నారు.

➡️