ప్రజాశక్తి-పొదిలి : మాజీ ఎంపిపి, ఆర్‌ఎంపి వైద్యుడు డాక్టర్ కఠారి రాజు 6వ వర్ధంతి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు కుమారుడు భరత్ చంద్ర, ఆర్‌ఎంపి మరియు పిఎంపి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఎంపిటిసి డాక్టర్ ఇమాంసా, కఠారి చిన్న రాజు, కఠారి సుబ్బారావు, కఠారి విజరు, మస్తాన్, సందాని బాషా, నాసర్ వలి,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.