మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Nov 28,2024 20:25

 ప్రజాశక్తి-విజయనగరంకోట/టౌన్‌ :  మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్‌ సమీపంలోని పూలే జంక్షన్‌ వద్ద గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో, పూలే విగ్రహానికి, చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి కూడా నివాళులర్పించారు. డిబిసిడబ్ల్యూఒ పెంటోజీరావు, బిసి సంఘ జిల్లా నాయకులు ముద్దాడ మధు మాట్లాడుతూ, జ్యోతిభా పూలే జాతికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌.శ్రీనివాసమూర్తి, డిపిఆర్‌ఓ డి.రమేష్‌, కలెక్టరేట్‌ ఎఒ దేవ్‌ ప్రసాద్‌, ఎబిసిడబ్ల్యూఒలు యశోధనరావు, రాజులమ్మ, శ్యామల, బిసి వసతిగృహ సంక్షేమాధికారులు, వివిధ బిసి సంఘాల నాయకులు పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్‌ ఆవరణలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనకబడిన సామాజిక వర్గాలు కూడా గొప్ప చదువులు చదువుకొని రావాలని పోరాడిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణ(పులి రాజు), రాంభద్రపురం ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు, పీరుబండి జైహింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.సామాజిక దార్శనికుడు పూలే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. జ్యోతిరావుపూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం గురాన అయ్యలు కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాలాజీ నగర్‌ లోని జనసేన కార్యాలయంలో జ్యోతిరావ్‌ పూలే వారి చిత్రపటానికి అవనాపు విక్రమ్‌ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.సామాజిక ఉద్యమకారుడు నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ మూఢనమ్మకాలు పారదోలాలని పూలే సామాజిక ఉద్యమం చేపట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా విజయం పార్టీ కార్యదర్శి సిహెచ్‌ బంగార్రాజు, జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టివి దుర్గారావు, జిల్లా శాతవాహన సంఘం అధ్యక్షులు కె.విశ్వనాథం,జిల్లా యువజన సంఘ నాయకులు గరుగుబిల్లి వినరు బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️