ఎన్‌ టి ఆర్‌ వర్ధంతి – ఎమ్మెల్యే వేగుళ్ల నివాళి

ప్రజాశక్తి, మండపేట (కోనసీమ) : తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గని ఎన్‌.టి.ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్ధానిక కరాచి సెంటర్‌ వద్ద ఉన్న ఎన్‌.టి.ఆర్‌ విగ్రహం వద్దకు వెళ్ళి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఫించను పధకాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.ఆర్‌ అన్నారు. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని ఎన్‌.టి.ఆర్‌ విశ్వసించిన సిద్ధాంతాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీ వరప్రకాష్‌, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గడి సత్యవతి రాంబాబు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మందపల్లి దొరబాబు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పిల్లి గణేశ్వరరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️