రామోజీరావుకు నివాళి

Jun 8,2024 22:05
రామోజీరావుకు నివాళి

రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు
రామోజీరావుకు నివాళి
ప్రజాశక్తికందుకూరు ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు టిడిపి ఘన నివాళులు అర్పించింది. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనాడు పత్రిక, చానల్స్‌ ద్వారా కోట్లమందిలో చైతన్యాన్ని నింపి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఇంటూరి నాగేశ్వరరావు కొన్యిఆడారు. పేదలను, బాధితులను ఆదు కోవడంలో రామోజీరావు ముందు నిలిచారన్నారు. తెలుగు భాషను పరిరక్షించడంలో ఎనలేని సేవ చేశారన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య ఉన్నారు. ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాలలో.. జర్నలిజం దిక్సూచి చెరుకూరి రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుందని ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కాలేజీలో సిబ్బంది, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయి రాజకీయ నాయకులు సైతం ప్రజాస్వామ్యవాదిగా ప్రశంసలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక తెలుగు తేజం అంతరించినట్లయిందన్నారు. లక్షలా దిమందికి జీవనోపాధి కల్పించి, పలు రంగాల్లో విజేతగా రామోజీ ఒక లెజెండ్‌ గా నిలిచిపోయారన్నారు. కొద్దికాలం ఆయన సంస్థల్లో పనిచేసి ఆదర్శంగా భావించిన వేలాదిమంది పలు రంగాల్లో నిష్ణాత్తులుగా నిలిచి ఆయన్ను గుండెల్లో నింపుకున్న తనలాంటి వారికి దైవ సమానమని రామయ్య పేర్కొన్నారు.” ఒంగోలు బుల్‌ ” ఒకటిన్నర దశాబ్దం పాటు ”ఈనాడు”లో కందుకూరు నుండి హైదరాబాద్‌ వరకు వివిధ స్థాయిల్లో పనిచేసిన తనకు రామోజీరావు తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదిగా రామయ్య అభివర్ణించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

➡️