రామోజీరావుకు ఘన నివాళి

Jun 9,2024 21:24

ప్రజాశక్తి – గుర్ల : భారత దేశ పత్రిక రంగంలో మంచి వ్యక్తిని కోల్పో యామని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు, టిడిపి నాయకులు డాక్టర్‌ సుంకరి రమణమూర్తి అన్నారు. గుర్లలో ప్రెస్‌ క్లబ్‌ వద్ద టిడిపి, జనసేన, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, గుర్ల ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు సంయుక్తంగా రామోజీరావుకు ఆదివారం శ్రద్ధాంజలి ఘటిం చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం మీడియా రంగానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసెల్‌ కార్యదర్శి వెన్నె సన్యాసినాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌, జనసేన విజయనగరం కో ఆర్డినేటర్‌ కోట్ల కృష్ణ, జనసేన సీనియర్‌ నాయకులు దంతులూరి రమేష్‌ రాజు, టిడిపి మండల అధ్యక్షులు చెనమల్లు మహేశ్వరరావు, నాయకులు నాగులపల్లి నారాయణరావు, వల్లూరు భాస్కరరావు, సుంకరి ఉపేంద్ర, సీనియర్‌ పాత్రికేయులు తవుడు, మజ్జి రామారావు, సూర్యనారాయణ, లక్షుంనాయుడు, పైడినాయుడు, రాము నాయుడు, భాస్కరరావు నరసింహమూర్తి, శంకర్‌, ఈశ్వరరావు, గేదెల సత్యనారాయణ, విద్యార్థి సేన నాయకులు సుంకరి నారాయ ణరావు, మీసాల జగన్‌, వల్లూరు నాయుడు తదితరులు పాల్గొన్నారు.బాడంగి: రామోజీరావు మృతి పట్ల విజయనగరం పార్లమెంట్‌ తెలుగు యువత అధికార ప్రతినిధి రాంప్రసాద్‌ ఆదివారం సానుభూతిని తెలిపారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఓ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారని గుర్తు చేశారు.

➡️