రామోజీరావుకు ఘన నివాళి

Jun 10,2024 23:54 #Ramoji nivali
Ramoji Nivali

ప్రజాశక్తి-యంత్రాంగం సీతమ్మధార : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు విశాఖ జర్నలిస్టులు ఘన నివాళులర్పించారు. ఎస్డీవీ చానల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సత్యనారాయణ రాజు, విజన్‌ దినపత్రిక బ్యూరో రవికాంత్‌ ఆధ్వర్యాన విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం రామోజీ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్‌ దినపత్రిక సంపాదకులు వివి.రమణమూర్తి మాట్లాడుతూ తెలుగు జర్నలిజం గురించి మాట్లాడాలంటే రామోజీ గురించి చెప్పుకోవాలన్నారు. ఈనాడు సామాన్యుల గుండె చప్పుడుగా మారిందంటే అది రామోజీ కృషే కారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజన్‌ ఎడిటర్‌ శివశంకర్‌, విశాఖ సమాచారం ఎడిటర్‌ వీరభద్రరావు, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌ జనార్ధనరావు, ఆంధ్రప్రభ బ్యూరో గంట్ల శ్రీనుబాబు, డిడి ఆనంద్‌, స్థానిక పత్రికల సంఘం అధ్యక్షులు పులిగడ్డ సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు హరనాథ్‌, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రెసిడెంట్‌ నారాయణ, వివిధ పత్రికలు, ఛానెళ్ల పాత్రికేయులు పాల్గొన్నారు. కె.కోటపాడు : ఈనాడు సంస్థల అధినేత సిహెచ్‌.రామోజీరావుకు స్థానిక అయ్యన్న విద్యా సంస్థల ప్రాంగణంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. అయ్యన్న విద్యా సంస్థల అధినేత డాక్టరు ఖాశీం, విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఖాసీం మాట్టాడుతూ రామోజీరావు సామాజిక సేవల స్ఫూర్తితో అయ్యన్న విద్యాసంస్థలు భాగస్వామ్యులు కావడం తమకు గర్వంగా ఉందన్నారు. ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, ఓటర్లకు అవగాహన, పర్యావరణ పరిరక్షణ, ఇంకుడు గోతులు నిర్మాణం, సుజలం-సుఫలం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అయ్యన్న విద్యాసంస్థలలో నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఈనాడు నిర్వహించిన క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో అయ్యన్న కాలేజీ విద్యార్థులు ప్రతి ఏడాది పాల్గొని విజేతలుగా నిలిచారని పేర్కొన్నారు. రామోజీరావు మార్గదర్శకంలో చేపట్టిన సామాజిక చైతన్య కార్యక్రమాలు అనేక మంది విద్యార్థులకు దోహద పడ్డాయన్నారు. అందరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న జూనియర్‌, కాలేజీ డిగ్రీ కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు నూర్జహాన్‌, సుమతి, రమణ, అప్పారావు, చెల్లారావు, దేముడు, శివ, సరోజ, సత్యవతి, జ్యోతి, కళ్యాణి, విద్యార్థులు పాల్గొన్నారు.ఎంవిపి.కాలనీ : ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు సుంకర రమణమూర్తి అద్వర్యంలో ఎయు జర్నలిజం విభాగంలో రామోజీరావు చిత్రపటం వద్ద ఘనంగా నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఎయు పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, ఎయు ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య నరసింహారావు, ఆచార్య డివిఆర్‌.మూర్తి, జర్నలిజం విభాగాధిపతి ఆచార్య వినరు కుమార్‌, స్టూడెంట్‌ యునైటెడ్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్‌.బసవ తదితరులు పాల్గొన్నారు.

➡️