టిడిపి సీనియర్‌ నాయకులకు సన్మానం

ప్రజాశక్తి-కంభం రూరల్‌: గిద్దలూరు నియోజక వర్గంలో ముత్తుముల అశోక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా సోమవారం కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను, ఒంగోలు పార్లమెంట్‌ నాయకులు కేతం శ్రీను, కొత్తపల్లి శ్రీను, ఒంగోలు పార్లమెంట్‌ మైనారిటీ నాయకులు ఎన్టీఆర్‌ గౌస్‌, సీనియర్‌ నాయకులు సయ్యద్‌ నూరుల్లా ఖాద్రీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు మాధవమూర్తిలను అర్బన్‌ కాలనీకి చెందిన జేడీ బాబు, మెడిగ శ్రీను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహబూబ్‌బాషా, బషీర్‌, కాకర్ల పిచ్చయ్య, హుస్సేన్‌, ముజీబ్‌, మున్నా, మాజ్‌, ఇస్మాయిల్‌, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️