టిడిపి, జనసేన మహిళా కార్యకర్తలకు సన్మానం

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం టిడిపి, జనసేన మహిళా కార్యకర్తలను పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా సత్కరించారు. ముందుగా మహిళలకు స్వాగతం పలికి శాలువాలు కప్పి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి ఈదల సత్తిబాబు సమకూర్చి ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ … ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు భారీ గెలుపుకు, పార్టీ అభివృద్ధికి మహిళలు ఎంతగానో కృషి చేశారన్నారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా పార్టీ పటిష్టత కోసం వారి నిరంతర కృషి అభినందనీయం అన్నారు. అలాంటి కార్యకర్తలను గౌరవించుకోవడం తమ కర్తవ్యం గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్‌ ఈదల నల్లబాబు, మాజీ సొసైటీ చైర్మన్లు వంటిపల్లి వెంకట సతీష్‌ కుమార్‌, వైట్ల సత్యనారాయణమూర్తి, మాజీ జెడ్పిటిసి రామానుజుల శేషగిరిరావు టిడిపి నేతలు ఈదల రాంబాబు, కట్టా రాజు, కడియాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

➡️