ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండలో గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా శనివారం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అయన తన కవితలతో సమాజంలోని కుళ్లును ఎండగట్టాడని తెలిపారు. ఈ కార్యక్ర మంలో విహార ట్రస్ట్ అధ్యక్షులు అల్లు వెంకటేశ్వర్లు, ఉపాసక గాండ్ల హరిప్రసాద్, అడ్వకేట్ పోకూరి కోటయ్య, అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పులగర కృష్ణయ్య, దళిత్ రైట్స్ అధ్యక్షులు తులిబిల్లి అశోక్ బాబు, దేవరకొండ శ్రీనివాసులు, బొడ్డు తిరుపతిస్వామి, దామవరపు రాంబాబు, పాలేపు మాధ వరావు, ఏపూరి శ్రీనివాసులు, వై.ఉజ్వల్, నాంచార్లు ఉన్నారు.