విద్యుత్‌ అమరవీరులకు నివాళి

ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక పంగులూరి కృష్ణయ్య భవనంలో విద్యుత్‌ అమరవీరుల దినోత్సవాన్ని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపే విద్యుత్‌ సంస్కరణలను ప్రజా తిరుగుబాటుతో వెనక్కి కొట్టడమే అమరవీరులకు నిజమైన నివాళి అని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం 25 ఏళ్ల సంస్కరణల వైఫల్యాల అనుభవాన్ని గుర్తించి తమ విధానాలు మార్చుకోవాలన్నారు. విద్యుత్‌ భారాలు తగ్గించాలని, కార్పోరేట్ల దోపిడీని అరికట్టాలని , సర్దుబాటు ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్మార్టు మీటర్ల ఏర్పాటు ఆపాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు తొలగించాలని, ఆదాని తదితర కంపెనీలతో చేసుకున్న అడ్డగోలు ఒప్పందాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు,కొల్లూరి వెంకటేశ్వర్లు, టి. రామారావు, పులి ఓబులరెడ్డి, సిహెచ్‌. కొండయ్య పాల్గొన్నారు.

➡️