ఫారుఖ్‌ అలీకి ఘన నివాళులు

Jun 11,2024 22:41
ఫొటో : మాట్లాడుతున్న నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న నాయకులు
ఫారుఖ్‌ అలీకి ఘన నివాళులు
ప్రజాశక్తి-ఉదయగిరి : జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో షేక్‌ గాజుల ఫారుక్‌అలీ సంస్మరణ సభలో పలువురు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మంగళవారం స్థానిక షాదీ మంజిల్‌లో గాజులపల్లి రామిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంస్మరణ సభలో పలువురు మాట్లాడుతూ షేక్‌ గాజుల ఫరూక్‌అలీ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని, ఆయన అనేక ప్రజా ఉద్యమాలలో స్వచ్ఛందంగా పాల్గొని జనానికి సైన్స్‌ విజ్ఞానాన్ని అందించారన్నారు. అక్షరాస్యత ఉద్యమంలో ఆరోగ్య దీపం కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదాన ఉద్యమంలో రక్తదాన అవగాహన కార్యక్రమాలలో ప్రజలకు జబ్బులు వచ్చి ఆరోగ్యం చెడిపోయి వారు ఇబ్బంది పడే పరిస్థితుల నుండి అసలు జబ్బులు రాకుండా ఏ విధంగా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేస్తూ వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్‌ దస్తగిరి అహ్మద్‌, జిల్లా కార్యదర్శి వడ్డే చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షులు కుమ్మిత శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ గౌస్‌ బాషా, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి డిగ్రీ కళాశాల ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌ ఆకుల నర్సింహారెడ్డి, డాక్టరు శ్యాంప్రసాద్‌, డాక్టర్‌ వేణుగోపాల్‌, వేణు నర్సింగ్‌ హోమ్‌ ఐక్య ఉపాధ్యాయ రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నాయకులు ఫణీంద్ర, గాజుల రామతుజని, మున్నా, శ్రీనివాసులు, భోగ్యం, మాజీ మండల విద్యాశాఖ అధికారి మోహన్‌ రావు, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌, జెవివి కార్యకర్తలు, యుటిఎఫ్‌ కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

➡️