రామోజీరావుకు నివాళులు

Jun 10,2024 21:45
ఫొటో : రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

ఫొటో : రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు
రామోజీరావుకు నివాళులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : వ్యాపారరంగంతో పాటు మీడియా రంగంలోనూ తనదైన ముద్ర వేసి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి చెరుకూరి రామోజీరావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో రెడ్‌ ఆధ్వర్యంలో ఎమ్‌డి సాధిక్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు రామోజీరావు ప్రస్థానం గురించి మొదటి నుంచి నేటి వరకు వివరించారు. పత్రికారంగంలో, సినీరంగంలో ఉంటూ తెలుగుభాష అభివృద్ధికి ఆయన పాటుపడ్డారని వివరించారు. తెలుగు కోసం ప్రత్యేకంగా ఒక నిఘంటవు కూడా ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో కుడుములు సుధాకర్‌ రెడ్డి, లక్కు కృష్ణప్రసాద్‌, డేవిడ్‌ రాజు, సామాజిక కార్యకర్త ఒంటేరు మల్లికార్జున, మేధా స్కూల్‌ కస్పాండెంట్‌ సుబ్బయ్య, గార్లపాటి సురేష్‌ బాబు, డాక్టర్‌ కె ఎన్‌ రాజు, సండ్ర వెంకటసుబ్బ నాయుడు, జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు హరికృష్ణ, బడుగు శ్రీనివాసులు షేక్‌ సంధాని, నెల్లూరు శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️