రామోజీరావు మృతదేహానికి నివాళులు

Jun 8,2024 22:03
ఫొటో : నివాళులర్పిస్తున్న చెంచలబాబుయాదవ్‌

ఫొటో : నివాళులర్పిస్తున్న చెంచలబాబుయాదవ్‌
రామోజీరావు మృతదేహానికి నివాళులు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఈనాడు సంస్థ అధినేత చెరుకూరి రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చెంచల బాబు యాదవ్‌ ఘన నివాళులు అర్పించారు. శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహాని సందర్శించి ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు మరణం జర్నలిజం రంగానికి పేద బడుగు బలహీన వర్గానికి తీరని లోటు అన్నారు. అలాగే రామోజీరావు ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఈ దేశంలో ఎందరికో ఉపాధి కల్పించారని కొనియాడారు. అలాగే రామోజీరావు ఈ దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగిన తన సంస్థల ద్వారా ఎందరో పేదలను ఆదుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పవిత్ర సంస్థల అధినేత టిడిపి నాయకులు వెంకటేష్‌ చౌదరి పాల్గొన్నారు.

➡️