ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పలమనేరు నీలగుంటలో మంగళవారం ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ … మనుషుల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఐక్యతను చాటే విధంగా ఇలాంటి బహుమఖ కార్యక్రమాలలో ప్రజలు పాల్గనడం అభినందనీయమన్నారు. మహిళలు పిల్లలు సంక్రాంతి సందర్భంగా అందరూ కలిసి ఐక్యంగా వీధుల్లో ముగ్గులు వేయడం గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా ప్రజలపై భారం పడుతున్న విద్యుత్ చార్జీలు వద్దు అని ముగ్గుల్లో ప్రతిబింబించడం అభినందనీమన్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ అభివఅద్ధి అయిన తర్వాత మనుషుల మధ్య సంబంధాలు సన్నగిల్లుతున్నాయన్నారు. దీనిని అసరాగా తీసుకొని పాలకులు ప్రజలపై భారాల మోపుతున్నారు. ప్రజల మధ్య కులాల పేరుతో మతాలు పేరుతో చిచ్చు పెడుతూ ఐక్యత దెబ్బతీస్తున్నారని దీనిని పసిగట్టి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. పల్లెల్లో కూడా పండగ వాతావరం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన ప్రజలందరూ కలిసి పని చేసుకునేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇలాంటి బహుముఖ కార్యక్రమాల వలన ప్రజలందరూ కలవడానికి అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఐక్యత చాటాలని పిలిపునిచ్చారు. సిపిఎం శాఖ కార్యదర్శి రాజా జయంతి ల ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా,నాయకులు రాజా జయంతిలతోపాటు మహిళలు పాల్గొన్నారు
