ప్రజాశక్తి-వేంపల్లె ఒంగోలు ట్రిపుల్‌ఐటికి చెందిన విద్యార్థి జమీషా ఖురేషీ(17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ఐటిల్లో విషాదఛాయలు అలు ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన సయ్యద్ మగ్బుల్ కుమారై జమీషా ఖురేషీకి ఒంగోలు ట్రిపుల్ ఐటిలో సీటు రావడంతో ఇంటర్ సెకండ్ ఇయర్ (పి-2)చదువుతున్నది. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటి ప్రాంగణంలో ఉన్న ఒంగోలు ట్రిపుల్‌ఐటి క్యాంపస్ చదువుతున్న జమీషా ఖురేషి మంగళవారం రాత్రి 9 గంటలకు బ్రాత్ రూంలో తన చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మక్ష్మిఋతి చెందినట్లు ట్రిపుల్‌ఐటి అధికారులు తెలిపారు. స్థానిక విద్యార్థుల సమాచారతో ట్రిపుల్‌ఐటి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని అర్థరాత్రి వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ ఇయర్‌కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద పోయింది. ఆ మొబైల్ ఫోన్‌ను మృతి చెందిన విద్యార్థి జమీషాఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించిన ట్రిపుల్‌ఐటి అధికారులు విద్యార్థిని మందలించడంతో పాటు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారితో విద్యార్థినితో మాట్లాడించినట్లు తెలిసింది. జమీషాఖురేషి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్టడీ అవర్‌లో విద్యార్థిని కనపడక పోవడంతో ఆమె కోసం సిబ్బంది, సహ విద్యార్థులు వెతికారు. రాత్రి 11 గంటలకు బ్రాత్ రూంలో చున్నీతో ఉరి వేసుకొన్న సంఘ టన చూసి ఇడుపులపాయలోని ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి వేంపల్లె ఆస్పత్రికి తరలించారు. విషయం కనుగొన్న సమయానికి విద్యార్థిని మృతి చెంది నట్లు సిబ్బంది చెప్పారు. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఇడుపులపాయకు బయలుదేరి వచ్చారు. ఈ ఘటనపై ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీసులు మృతి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తెలుసుకొన్న పులివెందుల డిఎస్‌పి మురళి నాయక్ వేంపల్లె ఆసుపత్రి వద్దకు వచ్చి విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు విద్యార్థిని తల్లిదండ్రులు మగ్బుల్, నసీమాలతో మాట్లా డారు. ట్రిపుల్‌ఐటి అధికారులతో, విద్యార్థులతో మాట్లాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ట్రిపుల్‌ఐటి వద్దకు వస్తామని చెప్పమని అంతలోనే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. మృతురాలి తల్లిదండ్రులు మగ్బుల్, నసీమాలకు ఒక కుమారుడు, కుమార్తె ఉండగా కుమారుడు బిటెక్ చేస్తుండగా, కుమార్తె ట్రిపుల్‌ఐటిలో చదువు తున్నది. చీరాల మండలంలో ఉన్న ఐటిసి కంపెనీలో మృతురాలి తండ్రి మగ్బుల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కార్మికుడిగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివిం చుకొంటున్నట్లు వారు చెప్పారు. ట్రిపుల్‌ఐటిలో మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఎంతో ఆశతో ఉన్నామని మధ్యలో ఇలాంటి ఘోరం జరిగిందని తల్లిదండ్రులు వాపోయారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థి మృత దేహాన్ని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటి డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్‌తో పాటు ఒంగోలు ట్రిపుల్‌ఐటి అధికారులు సందర్శించారు. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్కేవ్యాలీ ఎస్‌ఐ రంగారావు తెలిపారు. విద్యార్థి ఆత్మహత్య బాధాకరం : పిసిసి విద్యార్థి జమీషాఖురేషి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధా కరమని పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థి మృతదేహాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థిని తల్లిదండ్రులతో ఘటనపై చర్చించి వారిని ఓదార్చారు.ఇడుపులపాయ డైరెక్టర్‌తో ఘటనపై అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగాగా తులసిరెడ్డి మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటిలో చదివే విద్యార్థులు అందరూ యుక్త వయస్సులో ఉండే పిల్లలని అ వయస్సులో సున్ని తంగా ఉంటారని చెప్పారు. కళాశాల యాజమాన్యం, ప్యాకల్టీ, తల్లిదండ్రులు చాల జాగ్రత్తతో వారితో ప్రవర్తించాలని కోరారు. ఇలాంటి దురదష్ట సంఘ టనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుబ్బరాయుడు, ఉత్తన్న, సుబ్రమణ్యం, వెంకటేష్ పాల్గొన్నారు.
