త్రిపురాంతకం ఎంపిపి సుబ్బారెడ్డి రాజీనామా

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు కోట్ల సుబ్బారెడ్డి సోమ వారం తన పదవికి రాజీ నామా చేశారు. గతంలో రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ఒప్పందం మేరకు రాజీనామా చేసినట్లు సమాచారం. మిగిలిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఎంపిపిగా మండలానికి చెందిన ఆళ్ల ఆంజనేయరెడ్డి వ్యవహరిస్తారు. కాగా కోట్ల సుబ్బారెడ్డి తన రాజీనామా పత్రాన్ని ఒంగోలులోని జడ్పి సీఈవో కార్యాలయంలో సీఈవోకు అందజేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఆళ్ల ఆంజనేయరెడ్డి ఉన్నారు.

➡️