ఫుట్‌బాల్‌ విజేతలకు ట్రోఫీలు

Jun 10,2024 23:51 #Foot ball trophy
Foot ball trophy

ప్రజాశక్తి- తగరపువలస : ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో గెలుపొందిన క్రీడాకారులకు తెలుగు యువత ఒకటో వార్డు అధ్యక్షులు గరే సదానంద సోమవారం ట్రోఫీలు అందజేశారు. చిట్టివలస జెడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. వేణు లెవెన్స్‌ జట్టు మొదటి స్థానంలో, చంద్ర లెవెన్స్‌ జట్టు రెండో స్థానంలో నిలిచినట్లు టోర్నమెంట్‌ నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షులు తమ్మిన సూరిబాబు, ఎర్నింటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️