వైకుంఠ ఏకాదశి.. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం : టిటిడి ఈఓ శ్యామలా రావు

Jan 7,2025 17:19 #ttd

ప్రజాశక్తి – తిరుపతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామని టిటిడి ఈఓ శ్యామలా రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడితో మాట్లాడుతూ..  జనవరి 10 నుంచి పదిరోజులపాటు పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామని ఆయన అన్నారు. జనవరి 10 ఉదయం 4:30 విఐపీ దర్శనం, 8:30 సామాన్య భక్తులు దర్శనం, ఏకాదశి నాడు స్వర్ణ రథం ఊరేగింపు జరపనున్నట్లు ఆయన అన్నారు. ఇక 12 గంటలకు వాహన మండపంలో భక్తులు కోసం ఉత్సవమూర్తుల, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం, 9 తేది ఉదయం 5 గంటలకు తిరుమల తిరుపతి లో 94 కౌంటర్ లో టోకెన్ లు కేటాయింపు జరుగుతుందని ఆయన తెలిపారు.

10,11,12,తేదిలకు 9 తేదినే టోకెన్ కేటాయింపు జరుగుుతందని, తక్కిన రోజుల్లో ఏరోజుకారోజు మూడు ప్రదేశాలలో టోకెన్ కేటాయిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించాము. ప్రత్యేక దర్శనాలు రద్దు, వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఉన్న వారికే పది రోజుల పాటు దర్శనం, టికెట్లు లేకుంటే దర్శనం లేదు, పది రోజుల్లో 7 లక్షలమంది దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. జనవరి 9 న సర్వదర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కన్నారు.

్రశీవారి దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలు రద్దు చేస్తన్నట్టలు టిటిడి ఈఓ శ్యామలా రావు స్పష్టం చేశారు. ఈరోజుల్లో వసతి ఎవరు ముందు వస్తే వారికే కేటాయిస్తాము. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాము. 12 వేల వాహనాలకు వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాము. టోకెన్ ఇచ్చే కేంద్రాల వద్ద విజిలెన్స్, పోలీసుల సహాయంతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం ఆరు గంటల నుండి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆలయంలో  ప్రత్యేక అలంకరణకు మూడువేల మంది శ్రీవారి సేవకులు సేవలు వినియోగించుకుంటామని శ్యామలరావు తెలిపారు. ఈరోజుల్లో
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు.

మహాకుంభమేల లో టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. 2.89 ఎకరాల భూమి కుంభమేళా లో కేటాయించారు, అక్కడ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తాము. శ్రీవారి ఆలయం జరిగే అన్నీ సేవలు, కైంకర్యాలు నమూనా ఆలయంలో నిర్వహిస్తాము.
జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 26 తేదిలలో కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. రేపు తిరుమల నుండి కుంభమేళా కి కళ్తాణ రథం ప్రారంభం అవుతుంది అని టిటిడి ఈఓ శ్యామలా రావు  తెలిపారు.

ప్రత్యేక భద్రతా ఏర్పాటు చెస్తాము..
…సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తాము. పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశాము. భక్తులకు టికెట్ పైనే రూట్ మ్యాప్ ఏర్పాటు చేశాము. క్యూఆర్ కోడ్ ద్వారా తిరుమల లో రూట్ మ్యాప్ తెలుసుకోవచ్చు. మూడు వేలమందితో వైకుంఠ ఏకాదశి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

 

 

➡️