నడకమార్గంలో సర్వదర్శనం టోకెన్లు పున:ప్రారంభం

Jan 23,2025 20:46 #in Tirumala, #ttd

ప్రజాశక్తి- రామచంద్రాపురం ( చంద్రగిరి) : శ్రీవేంకటేశ్వర స్వామి దర్వనానికి తిరుమలకు మెట్ల మార్గంలో నడిచి వెళ్లే సందర్శకులకు గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిటిడి గత 14 రోజులుగా టోకెన్ల జారీ నిలిపివేసింది. వైకుంఠ ఏకాదశి ఘట్టం ముగియడంతో నడిచి వెళ్లే సందర్శకులకు శ్రీవారి మెట్టు వద్ద దర్వనం టోకెన్ల జారీని గురువారం పున్ణప్రారంభించింది. ఈ టోకెన్లను మార్గమధ్యంలో విజిలెన్స్‌ విభాగం సిబ్బంది పరిశీలించి టిటిడి స్టాంప్‌ వేస్తారు. ఈ స్టాంపు వేసిన టోకెన్లు కలిగిన సందర్శకులను మాత్రమే శ్రీవారి దర్శనానికి క్యూకాంప్లెక్స్‌ వద్ద అనుమతించారు. రోజుకు ఐదు వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు టిటిడి పేర్కొంది. సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

➡️