ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ … కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం జిల్లాలో రెండు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి అన్నారు గతంలో కూడా తుగ్గలి మండలం కరువు మండలంగా ప్రకటించకపోవడంతో చాలామంది బతుకు తెరువు కోసం సూదూరా ప్రాంతాలకు వలస వెళ్లవలసిన పరిస్థితి ఈ మండలాలలో ఏర్పడిందన్నారు. తీవ్ర వర్ష భావ పరిస్థితి అప్పుడు ఉన్నప్పటికీ అప్పుడున్న ప్రభుత్వం తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదన్నారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురి అవుతున్నారన్నారు ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని నాగార్జున డిమాండ్ చేశారు