పాడి రైతులు అభ్యున్నతే టిడిపి లక్ష్యం : తుంగభద్ర ప్రాజెక్ట్స్‌ హై లెవెల్‌ కెనాల్‌ చైర్మన్‌ జోగి రెడ్డి

ప్రజాశక్తి-సింహాద్రిపురం (కడప) : పాడి రైతుల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని తుంగభద్ర ప్రాజెక్ట్స్‌ హై లెవెల్‌ కెనాల్‌ చైర్మన్‌ మా రెడ్డి జోగి రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని హిమకుంట్ల లో రూ 2.30 లక్షలతో నిర్మించిన మినీ గోకులన్నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో నిర్మించిన మినీ గోకులాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఉపాధి హామీ పథకం ఏపీవో జయ భారతి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ రజిత, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️