పసికందును విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

Oct 30,2024 00:46

ప్రజాశక్తి – మంగళగిరి : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో పని చేస్తూ బాలింతలకు మాయ మాటలు చెప్పి పసికందుల అపహరించి విక్రయిస్తున్న ఓ జంటను మంగళగిరి పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను పట్టణ సిఐ డి.వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. విజయవాడ వాగు సెంటర్‌ జోడుబొమ్మల సెంటర్‌కు చెందిన బొమ్మిడి ఉమాదేవి త్రినాథ్‌ దంపతులను ఒ పసికందును విక్రయిస్తున్నట్లు సమాచారం రాగా ఎస్పీ ఆదేశాలో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. 15 రోజుల పసిబిడ్డను రూ.5 లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకుని పసికందును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. బిడ్డను స్త్రీ,సిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. అయితే పసికందు ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? దీని వెనుక పాత్ర దారులు ఇంకెవరున్నారు? అనే విషయాలు విచారణలో తెలియాల్సి ఉందని సిఐ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మరో జంటకూ ఈ కేసులో కీలక నిందితులని, వారి కోసమూ గాలిస్తున్నామని చెప్పారు. వారు పట్టుబడితే కేసు చిక్కుముడి విడే అవకాశం ఉందన్నారు.

➡️