ప్రజాశక్తి-కొండపి: రెండు బ్యారెన్‌లు దగ్దం అయిన సంఘటన కొండపి మండలంలోని చోడవరం గ్రామంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం గ్రామానికి చెందిన బి.అరుణ, బి.ఆంజనేయులు, బి.శ్రీవాణిలను చెందిన రెండు బ్యార్నీలలో అల్లిక కర్ర జారి మొద్దుగొట్టంపై పడడంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు కొండపి అగ్నిమాపక కార్యాలయంను సమాచారం ఇవ్వడంతో వెంటనే సిబ్బంది మంటలను అదుపు చేశారు. రెండు బ్యార్నీలలో టైర్లు, క్యూరింగ్‌లో ఉన్న ఆకు, కర్రమొత్తం అగ్నికి ఆహుతయింది. సుమారు రూ.4.5లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
