ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరు నియోజకవర్గం నాలుగు రోడ్ల కూడలి, తిరుమల డైరీ మధ్య రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు శివాడికి చెందినట్టు స్థానికుల సమాచారం. గాయపడిన మరో ఇద్దరు అస్సాం కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిని 108 ద్వారా పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
