రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

తాగిన మైకంలో బైక్‌ను ఢకొీట్టిన కారు డ్రైవర్‌

ఘటనాస్థలిలో ఒకరు, ఆసుపత్రికి వెళుతుండగా మరొకరు మృతి

ప్రజాశక్తి -కొయ్యూరు: మండలంలోని రావణాపల్లి గ్రామ శివారులో బైక్‌ను రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు ఢకొీన్న ఘటనలో ఆదివారం ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కొయ్యూరు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలివి.రాజేంద్రపాలెం నుంచి అంబటి అప్పన్న (40) అనే వ్యక్తి బైక్‌పై వస్తుండగా, ఎదురుగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారు ఢకొీనడంతో అప్పన్నతోపాటు బైక్‌పై వెనుక కూర్చున్న నర్సీపట్నం, ఎరకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజు (55)అనే వ్యక్తి కూడా దుర్మరణం పాలయ్యాడు. మద్యం మత్తులో కారు డ్రైవర్‌ సత్తిబాబు రాంగ్‌రూట్‌లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢకొీనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు బలంగా ఢకొీట్టడంతో అప్పన్న రహదారిపై పడిపోగా, లిఫ్ట్‌ అడిగి బైక్‌ ఎక్కి వెనుక కూర్చున్న నర్సీపట్నం ప్రాంతంలోని ఎరకంపేట గ్రామానికి చెందిన యాదగిరి రాజుబాబు 15 అడుగుల లోయలోకి పడిపోయాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న అప్పన్న, రాజుబాబు ఇద్దరికీ కాలు విరిగిపోయాయి. ప్రమాదంలో గాయపడిన రాజుబాబు సంఘటనాస్థలిలోనే మృత్యువాత పడ్డాడు. కాగా అప్పన్నను అంబులెన్స్‌లో కృష్ణదేవిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రధమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా కృష్ణదేవిపేట గ్రామ శివారులో మార్గమధ్యలోనే మరణించాడు.కాగా రాజేంద్రపాలెం నుంచి అప్పన్న బైక్‌పై వస్తుండగా, మార్గమధ్యలో రాజబాబు అనే వ్యక్తి లిఫ్ట్‌ అడిగి బైక్‌ ఎక్కినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

➡️