‘విస్డం’ ప్రైమరీ స్కూల్ విద్యార్థినికి రెండు బంగారు పతకాలు

Mar 13,2025 16:22 #Gold medals, #nandyala, #student

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ (నంద్యాల) : నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణ కొట్కూరు విస్డం ప్రైమరీ స్కూల్లో 5 వ తరగతి చదువుతున్న విద్యార్థిని సి. నేహా కు 4th, 7th ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో రెండు బంగారు పతకాలు సాధించినట్లు విస్డం హై స్కూల్ కరెస్పాండెంట్ అబ్దుల్ సలీం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖపట్నం లో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 55 కేజీలు, 30 కేజీల విభాగ పోటీలలో నేహా  రెండు బంగారు పతకాలు సాధించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి అన్నారు. విద్యార్థిని నేహా ఇలాంటి ఎన్నో పథకాలను సాధించి చదువుతున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. పాఠశాల నుండి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థిని ఆయన అభినందించారు.

➡️