ఫోటో- గాయాలకు గురైన ఎక్సైజ్ సిఐ సుభాషిని
ప్రజాశక్తి -దేవనకొండ : దేవనకొండ – పత్తికొండ రహదారిపై బుధవారం ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకుసంబంధించి వివరాల్లోకి వెళితే. మద్యం దుకాణాల తనిఖీల్లో భాగంగా పత్తికొండ నుండి దేవనకొండ గ్రామానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాషిణి సిబ్బందితో కారులో వస్తుండగా దేవనకొండకు రెండు కిలోమీటర్ల దూరంలో గుంతను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న సిఐ సుభాషిని, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాములకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.