ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు) : మండలంలోని రాజవొమ్మంగి పంచాయితీ శ్రీరామ నగర్ గ్రామ శివారు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న సారా బట్టి పై రాజవొమ్మంగి ఎస్‌ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే 300 లీటర్ల బెల్లం ఊటను, సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు. సారా బట్టి నిర్వాహకులు రాజవొమ్మంగి, ఒట్టిగడ్డ గ్రామాలకు చెందిన నాగులపల్లి వెంకటరాజు, రెడ్డి కన్నబాబులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకొని అడ్డతీగల కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ వేధించినట్లు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారు చేసిన విక్రయించిన తరలించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఎస్‌ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
