ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : మూడు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలైన ఘటన సోమవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మొగిలిగాట్లో జరిగింది. బెంగళూరు నుండి తిరుపతికి వెళుతున్న కారు పలమనేరు నుండి చిత్తూరు వైపున లారీ టిప్పర్ ఒకదాని ఒకదాని వెనక మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ట్రిప్పర్ డ్రైవర్ గంగవరం మండలం ఆరుమాకులపల్లి చెందిన శ్రీనివాసులకు తమిళనాడు రాష్ట్రం దిండిగల్ గ్రామానికి చెందిన చిరంజీవికి గాయాలు కాగా బంగారుపాళ్యం పోలీసులు 108లో ప్రధమ చికిత్స కోసం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
