మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం : డిఎస్‌పి

ప్రజాశక్తి-మదనపల్లి పట్టణంలో విద్యా సంస్థల పరిసర ప్రాంతాలలో మత్తు పదార్థాల క్రయ విక్రయాలు చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామని డిఎస్‌పి కొండయ్య నాయుడు పేర్కొ న్నారు. బుధవారం డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి విక్రయించినా, రాష్‌ డ్రైవింగ్‌ చేసినా, భూములు ఆక్రమించినా ఎవరిని వదిలేదని హెచ్చరించారు. పట్టణంలో యువత ఎక్కువగా గంజాయి తాగుతున్నారని, రాష్‌ డ్రైవింగ్‌ చేస్తు న్నట్లు తమ దష్టికి వచ్చిందని అన్నారు. కాలేజీ, స్కూల్‌ పరిసర ప్రాంతాలలో సిగరెట్‌, బీడీ, గుట్కా, వంటివి అమ్మకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూములు ఆక్రమణ చేసిన వారి పైన కూడా కేసులు నమోదు చేస్తామని, మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగులో పోలీసు స్టేషన్‌ వద్ద సెటిల్‌ మెంట్‌ చేసే వారి పైన నిఘా ఉంచా మని పేర్కొన్నారు. అటువంటి వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. మదనపల్లి ట్రాఫిక్‌ పైన దష్టి పెట్టి రికార్డులు లేని వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు.

➡️