రామానుజం మాథ్స్ టేలంట్ టెస్ట్ లో ఉల్లంపర్రు విద్యార్ధి కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

Dec 10,2024 13:46 #child

ప్రజాశక్తి – పాలకొల్లు : ప్రతిష్టాత్మకమైన  రామానుజం మాథ్స్ టేలంట్  టెస్ట్ లో   పాలకొల్లు- ఉల్లంపర్రు మాంటిస్సొరిస్ విద్యార్ధి  సి.హెచ్.ఆశిత్  స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు.  ఈ బాలుడు సి.హెచ్.ఆశిత్ 5వ తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ & డైరెక్టర్ మద్దాల వాసు మాట్లాడుతూ .. ‘ఎంతో ప్రతిష్టాత్మకమైన రామానుజం మాథ్స్ టేలంట్ టెస్ట్ నందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేల విద్యార్దులు పోటిపడ్డారు. ఉల్లంపర్రు మాంటిస్సొరిస్ విద్యార్ధి అయిన ఆశిత్ 95శాతం మార్కులతో ఆంధ్ర తో పాటు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలోను  స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మరొకసారి ఉల్లంపర్రు మాంటిస్సొరిస్ ఖ్యాతిని రాష్ట్రంలోనిలిపిన విద్యార్దికి నా శుభాకాంక్షలు’ అని ఆయన అన్నారు. అలాగే స్కూల్ సెక్రటరీ అండ్ కర్స్పండేంట్ మద్దాల రాంప్రసాద్, ప్రిన్సిపాల్ ఎస్.వసంత లక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్. ఉషా కుమారి, మాథ్స్ ఉపాధ్యాయులు గోపాలకృష్ణ లు కూడా ఆశిత్   అభినందించారు.

➡️