మహిళపై మామ దాడి – రోడ్డుపై రాస్తారోకో

Jul 30,2024 16:51 #prakasam, #Rally, #Uncle assaults woman

సింగరాయకొండ (ప్రకాశం) : సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కుమ్మ సుకన్య అనే మహిళపై ఇంటి వద్ద ఆమె మామ మాలకొండయ్య దాడి చేయడంతో పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరిగా స్పందించలేదని మంగళవారం ఉదయం వెంకటేశ్వర కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌ఐ టి శ్రీరామ్‌ ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమింపజేశారు.

➡️